బుచ్చిరెడ్డిపాళెంలో కోటి రూపాయలతో నూతన రహదారుల నిర్మాణ పనులు
రిపోర్టర్: అశోక్
స్థలం: నెల్లూరు
బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలో రూ.22 కోట్ల అంచనా వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద రోడ్లు, సెంట్రల్ మీడియన్లు, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేసినట్లు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. నెల్లూరు జిల్లాలో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలను కూడా ప్రగతిపథంలో నడిపిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.