చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలు: వేర్వేరు ఘటనల్ లో ఐదుగురు దుర్మరణం
రిపోర్టర్: రమేష్
స్థలం: చిత్తూరు
చిత్తూరు గ్రామీణ మండలం నెమలిగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారని పోలీసులు తెలిపారు. తవణంపల్లె మండలం మొదలపల్లెకు చెందిన బాబుతో పాటు మరో ఇద్దరు వేర్వేరు వాహనాల ఢీకొనే ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇదే జిల్లాలోని నగరి మండలంలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు లేకపోవడం మరియు వేగంగా వస్తున్న వాహనాలను అదుపు చేయలేకపోవడం వల్లే ఈ తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయని పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు.