ఫీజు రీయింబర్స్మెంట్ కోసం బీజేపీ ధర్మ పోరాటం.. అక్రమ అరెస్టులు!

రిపోర్టర్: Alfa News Desk స్థలం: తలకొండపల్లి

ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల బకాయిల కోసం పోరాడుతున్న బీజేపీ, బీజేవైఎం నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడంపై పద్మ అనిల్ ముదిరాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల పక్షాన చేసే పోరాటాన్ని అణచివేయడం సరికాదని హెచ్చరించారు.

పేద విద్యార్థులకు రావాల్సిన నిధులు చెల్లించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూస్తే ప్రభుత్వాలు కూలిపోతాయని, అణగారిన వర్గాల కోసం తాము ఎల్లప్పుడూ ముందుంటామని పద్మ అనిల్ ముదిరాజ్ పేర్కొన్నారు.