నాగ్పూర్ లో భారీ బీజేపీ మార్చ్: దేవేంద్ర ఫడ్నవీస్, నితిన్ గడ్కరీ నేతృత్వం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Nagpur
మహారాష్ట్రలో ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ నవంబర్ ఐదున నాగ్పూర్ లో భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బావన్కులే వెల్లడించారు. ఈ మార్చ్ కు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాయకత్వం వహిస్తారని ఆయన పేర్కొన్నారు. యశ్వంత్ స్టేడియం నుంచి సంవిధాన్ చౌక్ వరకు సాగే ఈ కార్యక్రమంలో సుమారు ఇరవై వేల మంది కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు.