రష్యాలో సరికొత్తగా రష్యన్ టీ10 లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
రిపోర్టర్: గోపి
స్థలం: రష్యా
రష్యాలో క్రికెట్‌ను పునరుజ్జీవింపజేసే లక్ష్యంతో రష్యన్ క్రికెట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చారిత్రాత్మక లుజ్నికి స్టేడియం వేదికగా రష్యన్ టీ10 లీగ్ టోర్నమెంట్ ప్రారంభమైంది. సెప్టెంబర్ 19, 20 తేదీల్లో జరిగే ఈ మెగా టోర్నమెంట్‌లో మాస్కో ఫాక్సెస్, క్రెమ్లిన్ స్టార్స్, కజాన్ ఫాల్కన్స్, సెయింట్ పీటర్స్‌బర్గ్ లయన్స్ అనే నాలుగు జట్లు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. రష్యాలో క్రికెట్‌ను ప్రధాన స్రవంతి క్రీడగా మార్చడమే లక్ష్యంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నట్లు ఫెడరేషన్ డైరెక్టర్ సంభవ్ జైన్ తెలిపారు.