మత సామరస్య వేదికగా ప్రశాంతంగా సాగాలని కోరిన ఏసీపీ

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వర్ధన్నపేట ఏసీపీ కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ముస్లిం, క్రిస్టియన్ మరియు హిందూ మత పెద్దలతో ప్రత్యేక శాంతి సమన్వయ సమావేశాన్ని ఏసీపీ అంబటి నరసయ్య నిర్వహించారు. వర్ధన్నపేట ప్రాంతం ఎల్లప్పుడూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో ఉత్సవాలను జరుపుకోవాలని ఆయన కోరారు. మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని, శబ్ద కాలుష్యం కాకుండా నిబంధనలు పాటించాలని సూచించారు.