దిల్లీలో భారత్ ఒపెక్ మధ్య విజయవంతంగా ముగిసిన ఇంధన చర్చలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: న్యూఢిల్లీ
ప్రపంచంలోనే అతిపెద్ద చమురు వినియోగదారుల్లో మూడో స్థానంలో ఉన్న భారత్ మరియు పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్ మధ్య దిల్లీ వేదికగా ఏడో హై లెవల్ ఎనర్జీ డైలాగ్ విజయవంతంగా ముగిసింది. భారత పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ, ఒపెక్ సెక్రటరీ జనరల్ హైథమ్ అల్ ఘైస్ సంయుక్తంగా అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో చమురు మార్కెట్లో స్థిరత్వం, ఇంధన భద్రత మరియు పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు.