తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న వర్షభీభత్సం
రిపోర్టర్: శివ
స్థలం: అమరావతి
మురసు తీవ్ర తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల్ లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించామని, జలాశయాల వద్ద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.