మియాపూర్ భూముల తీర్పుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంచలన ఆరోపణలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Hyderabad

మియాపూర్ భూములు ప్రభుత్వానికే చెందుతాయని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఆయన మాట్లాడుతూ, నాటి సీఎం కేసీఆర్, ఆయన బంధువులు విలువైన భూములను కబ్జా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారని ఆరోపించారు. ప్రభుత్వ భూముల రక్షణ కోసం తాము చేసిన న్యాయపోరాటం ఫలితంగానే అక్రమాలు వెలుగులోకి వచ్చాయని, కబ్జాదారుల చెర నుంచి వేల కోట్ల ఆస్తులను కాపాడామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.