అమెరికాలో ట్రంప్ జూనియర్ నోటిజారీ వ్యాఖ్యలు: ఒహియోపై తీవ్ర కలకలం
రిపోర్టర్: అశోక్
స్థలం: Washington
అమెరికాలో ఎన్నికల ప్రచార సభలో డొనాల్డ్ ట్రంప్ జూనియర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. డెమొక్రాట్లు అధికారంలోకి వస్తే ఒహియోను ఒక రాష్ట్రంగా మారుస్తారని ఆయన హెచ్చరించారు. అయితే 1803 లోనే ఒహియో అమెరికాలో రాష్ట్రంగా చేరినప్పటికీ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వైస్ ప్రసిడెంట్ జెడి వాన్స్ తో కలిసి ఆయన ప్రచారం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని మీడియా వర్గాలు తెలిపాయి.