మత సామరస్యతకు ప్రతీక ఖాదర్ బాబా దర్గా
రిపోర్టర్: BHAVANI THADI
స్థలం: విజయనగరం
శాంతి సౌబ్రాంతృత్వానికి, మత సామరస్యతకు సూఫీ అధ్యాత్మిక చక్రవర్తి హుజూర్ హజరత్ బాబా ఖాదర్ వలి దర్గా షరీఫ్ ప్రతీకగా నిలుస్తుందని చీమలపాడు సూఫీ పీఠాధిపతి బాబా ఖ్వాజా మోహియినుద్దీన్ ఉద్ఘాటించారు. బుధవారం జరగనున్న ఖాదర్ బాబా వారి 130వ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని మంగళవారం బాబామెట్ట దర్బార్ షరీఫ్ లో ఖాదర్ బాబా దర్గా, దర్బార్ షరీఫ్ ధర్మకర్త డాక్టర్ ఏం డీ ఖలీల్ బాబుతో కలిసి విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈరోజు సూఫీ పరంపరలో ఒక అద్భుతమైన పర్వదినమని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు భారీ అన్న సమారాధన నిర్వహించారు.