ఓబులవారిపల్లిలో ఓట్ల వేటలో దూకుడు పెంచిన వైసీపీ నేతలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఓబులవారిపల్లి
తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం చెన్నరాజుపోడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మైనారిటీ నాయకులు సుంకేసుల రఫీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీ అభ్యర్థి గూడూరు సుజాత, ఎంపీటీసీ అభ్యర్థి బండారు స్వప్నలతో కలిసి ఆయన పలు కాలనీల్లో పర్యటించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని స్థానిక ఓటర్లను కోరగా ప్రజలు ఘన స్వాగతం పలికారు.