Gen Z నిరసనలపై ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు Gen Z నిరసనలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏసీ గదుల్లో కూర్చొని సమస్యలు పట్టించుకోకపోతే కడుపుమండినవారు తిరగబడతారని హెచ్చరించారు. అధికారులు మానవీయ కోణంతో సమస్యలు పరిష్కరించాలని, సంక్షేమ పథకాల ద్వారా పేదరికానికి శాశ్వత పరిష్కారాలు చూపాలని దిశానిర్దేశం చేశారు.