రైతుబజార్లలో రూ.35 కే కిలో ఉల్లిపాయల పంపిణీ ప్రారంభం
రిపోర్టర్: అశోక్
స్థలం: విజయవాడ
పెరుగుతున్న నిత్యావసరాల ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు రైతుబజార్లలో కిలో రూ.35కే సబ్సిడీ ఉల్లిపాయల విక్రయాలను ప్రారంభించినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడలోని ఏపీఐఐసీ రైతుబజార్లో ఈ రాయితీ ఉల్లి కౌంటర్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఆధార్ లేదా రేషన్ కార్డు ఆధారంగా తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 130 రైతుబజార్లలో ప్రతి కుటుంబానికి రెండు కిలోల చొప్పున ఉల్లిపాయలను అందిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.