చంద్రబాబు తెచ్చిన మ్యాన్ మేడ్ కరువుపై జగన్ ఫైర్

రిపోర్టర్: గోపి స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది పూర్తిగా మ్యాన్ మేడ్ కరువు అని ఆరోపించారు. ఎల్ నినో రానున్నట్లు ముందే తెలిసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే రాష్ట్ర ప్రజలు ఈ దుస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.