ఒలింపిక్స్ పతక విజేత మను భాకర్ ఇంట్లో విషాదం.

రిపోర్టర్: వెంకట్ స్థలం: హర్యానా

ప్రముఖ భారత షూటర్, ఒలింపిక్స్ పతక విజేత మను భాకర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె నాయనమ్మ దయా కౌర్ అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వయసురీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్త తెలుసుకున్న మను భాకర్ భోపాల్‌లో జరుగుతున్న తన శిక్షణను అర్ధాంతరంగా నిలిపివేసి హుటాహుటిన స్వగ్రామానికి బయలుదేరారు.