పెదబయలులో బ్రిడ్జి నిర్మాణానికి జియో ట్యాగింగ్ ప్రక్రియ పూర్తి
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: పెదబయలు
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం పరదానపుట్టు నుంచి పోయిపల్లి వరకు కొత్త బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా మంగళవారం అధికారులు జియో ట్యాగింగ్ ప్రక్రియ చేపట్టారు. మాజీ ఎంపీటీసీ పి.అప్పారావు, మాజీ సర్పంచ్ బట్టి చిట్టిబాబు అలాగే ఇంజినీరింగ్ అసిస్టెంట్ సమక్షంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ వంతెన త్వరగా పూర్తి చేసి రాకపోకల ఇబ్బందులు తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.