విజయనగరం పోలీసు శిక్షణ కళాశాలలో ఈనెల 24న మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్

రిపోర్టర్: గోపి స్థలం: విజయనగరం

విజయనగరం పోలీసు ట్రైనింగ్‌ కళాశాలలో 473 మంది మహిళా కానిస్టేబుళ్లు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని కొలువు సాధించిన వీరికి ఈనెల 24న పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ జరగనుంది. గుంటూరు, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా, పశ్చిమగోదావరి తదితర జిల్లాలకు చెందిన మహిళలు కుటుంబసభ్యుల ప్రోత్సాహం, తమ పట్టుదలతో ఈ లక్ష్యాన్ని సాధించారు. తొమ్మిది నెలల పాటు అభ్యసించిన శిక్షణ, టెక్నికల్ నైపుణ్యాలు తమను మరింత ధైర్యంగా విధుల్లో నిలబెడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.