బాధితులకు ఉచిత న్యాయం అందిస్తామని న్యాయమూర్తి హరిబాబు హామీ

రిపోర్టర్: JR RAO స్థలం: శ్రీకాకుళం

ప్రతి పౌరుడికి ఉచిత న్యాయసహాయం పొందే హక్ కు ఉందని జిల్లా కోర్టు న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి హరిబాబు పేర్కొన్నారు. బుధవారం శ్రీకాకుళం మండలం బాదుర్లపేటలో ఉన్న స్త్రీ శిశు సంక్షేమ కార్యాలయంలో లీగల్ సర్వీసెస్ డే వారోత్సవాలు నిర్వహించారు. మహిళలు చిన్నారులు బలహీన వర్గాల వారికి న్యాయం మరింత చేరువ అవ్వడమే ఈ వారోత్సవాల లక్ష్యమన్నారు. గృహహింస బాల్య వివాహాలు పోక్సో చట్టాలపై వివరించారు.