తిరుపతిలో సంప్రదాయ వైభవంగా మోహన్ మంత్ర కళాంజలి ఫ్యాషన్ షో
రిపోర్టర్: విజయ్
స్థలం: తిరుపతి
తిరుపతి శివారులోని మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో మోహన్ మంత్ర - 2026 వేడుకల్ లో భాగంగా నిర్వహించిన కళాంజలి ఫ్యాషన్ షో విశేషంగా అలరించిందని నిర్వాహకులు తెలిపారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా యువతీయువకులు సంప్రదాయ వస్త్రధారణలో ర్యాంప్ వాక్ చేసి సందడి చేశారు. రంగురంగుల చీరలు, ఆభరణాలతో ప్రదర్శించిన ఈ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యతోపాటు కళాత్మక ప్రతిభను పెంపొందించడమే ఈ వేడుకల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు స్పష్టం చేశారు.