యూట్యూబర్ల ఇంట్లో కోటి విలువైన బంగారం చోరీ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Nagercoil

సోషల్ మీడియాలో విలాసవంతమైన వస్తువులు ప్రదర్శించిన యూట్యూబర్ల ఇంట్లో భారీ చోరీ జరిగింది. తమిళనాడులోని నాగర్కోవిల్లో వినోద్ కుమార్, మధుమిత దంపతుల నివాసంలో దుండగులు సుమారు ఒక కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. పూజా గదిలో నగదు, బంగారాన్ని చూపిస్తూ ఇటీవల వీడియో పోస్ట్ చేసిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ఘటనపై రాజమంగళం పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ టేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.