రేండ్లగూడ చెరువులు ప్రభుత్వ భూముల కబ్జాపై ఖానాపూర్ ఎమ్మెల్యేకు ఫిర్యాదు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మందపల్లి గ్రామపంచాయతీ పరిధిలో చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని గ్రామస్తులు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కు ఫిర్యాదు చేశారు గతంలో కలెక్టర్ వద్దకు కు పాదయాత్రగా వెళ్లి వినతి పత్రాలు ఇచ్చిన ఎలాంటి చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు స్పందించిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఎమ్మార్వో బక్కయ్యకు ఫోన్ చేసి అక్రమణాలపై నిలదీశారు. ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుని భూములను కాపాడాలని ఆదేశాలు జారీ చేశారు.