తెలంగాణలో ఈనెల 15 నుంచి విద్యారంగ బస్ యాత్ర

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను తెలుసుకునేందుకు ఈనెల 15 నుంచి 27వ తేదీ వరకు విద్యారంగ బస్‌ యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ ప్రతినిధి అకునూరి మురళి వెల్లడించారు. ఈ యాత్ర రెండు దశల్లో పూర్వ పది జిల్లాలను కవర్ చేస్తుందని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలని, బడ్జెట్‌లో 18 శాతం నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.