మల్లన్న సాగర్ కూల్చే కుట్ర: రేవంత్ రెడ్డి సర్కార్పై హరీష్ రావు తీవ్ర నిప్పులు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: సిద్దిపేట

మల్లన్న సాగర్ ప్రాజెక్టును కూల్చివేయాలని కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా కట్ట పక్కనే జిలెటిన్ స్టిక్స్తో బ్లాస్టింగ్ చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డను దెబ్బతీసినట్లే ఈ ప్రాజెక్టును కూడా నాశనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇరిగేషన్, పోలీస్ శాఖల నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమంగా ఈ పనులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.