డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న కేంద్ర ప్రభుత్వ వ్యూహం

రిపోర్టర్: మహేష్ స్థలం: India

దేశంలో డ్రగ్స్ మాఫియాను పూర్తిగా అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు వెళుతోంది. కేవలం అక్రమ రవాణాదారులను పట్టుకోవడమే కాకుండా, డ్రగ్స్ నెట్‌వర్క్‌లోని కార్టెల్స్, సరఫరా గొలుసులు, ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్లు, ఉపగ్రహాలు, డార్క్ వెబ్ ట్రాకింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డ్రగ్స్ వ్యవస్థను పూర్తిగా కూల్చివేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది.