ఖానాపూర్ దసరా వేడుకల్లో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
ఖానాపూర్లో వైభవంగా జరిగిన విజయదశమి వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన దసరా ప్రతి ఒక్కరిలో ఐక్యతా భావాన్ని నింపాలని కోరారు. అనంతరం వాతావరణ మార్పులపై రైతులకు అవగాహన కల్పించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.