తౌశిక్, మౌలాబి కేసుల దర్యాప్తు పారదర్శకంగా సాగుతోంది: ప్రకాశం జిల్లా ఎస్పీ

రిపోర్టర్: నరేష్ స్థలం: ప్రకాశం

తౌశిక్ కేసు దర్యాప్తుతో పాటు మౌలాబి కేసులోనూ అన్ని కోణాల్లో సమగ్రంగా విచారణ జరుపుతూ పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పూర్తి జవాబుదారీతనంతో దర్యాప్తు కొనసాగుతుందని ప్రకాశం పోలీస్ వెల్లడించారు. ఒంగోలులో తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమానికి ఎటువంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖ కట్టుబడి ఉందని ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.