చింతకానిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం, విద్యార్థుల సందడి
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఖమ్మం
ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని పాఠశాలల్లో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో పాఠాలు బోధించి సందడి చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ జీవిత విశేషాలను స్మరించుకుంటూ, మండల ఉత్తమ ఉపాధ్యాయులను ఎంఈఓ సలాది రామారావు సత్కరించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ఎదగాలని, ఆదర్శవంతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే ఉపాధ్యాయుల బాధ్యతని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.