గ్రామాల్లో పదేళ్లకుపైగా నివాసముంటే చట్టబద్ధమైన ఆస్తి హక్కులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వరంగల్
గ్రామాల్లో ఆబాదీ స్థలాల్లో పన్నెండేళ్లుగా నివాసం ఉంటున్న కుటుంబాలకు చట్టబద్ధమైన ఆస్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎలాంటి వివాదాలు లేకుండా నివాసం ఉంటున్నట్లు ఆధారాలు చూపిస్తే లీగల్ ప్రాపర్టీ కార్డులు మంజూరు చేయనున్నారు. పన్ను రశీదులు, పొరుగువారి వాంగ్మూలం ప్రాతిపదికగా గ్రామాల్లో ఈ కొత్త విధానాన్ని అమలు చేయడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు.