అన్ స్టాపబుల్ సీజన్ 5: మొదటి ఎపిసోడ్ కి చిరంజీవి గెస్ట్
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే సీజన్ 5 త్వరలోనే ప్రారంభం కానుందని ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. ఈ కొత్త సీజన్ తొలి ఎపిసోడ్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రేజీ కాంబినేషన్ కు సంబంధించిన వార్త ప్రస్తుతం టాలీవుడ్లో సర్వత్ర తీవ్ర చర్చనీయాంశంగా మారింది.