శక్తివంతమైన ఫీచర్లతో మార్కెట్లోకి ఐకూ 16 స్మార్ట్‌ఫోన్
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐకూ తాజాగా చైనా మార్కెట్లో సరికొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ ఐకూ 16 ను విడుదల చేసినట్లు కంపెనీ నిపుణులు తెలిపారు. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ చిప్సెట్, 8,400 ఎంఏహెచ్ శక్తివంతమైన బ్యాటరీతో పాటు ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను ఈ మొబైల్లో పొందుపరిచారు. ఈ సరికొత్త అత్యాధునిక స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర సుమారు రూ. 86,000 నుంచి ప్రారంభమవుతుందని టెక్ నిపుణులు వెల్లడించారు.