గుమ్మలక్ష్మీపురంలో ఓట్ల వేటలో దూకుడు పెంచిన పెంకి భారతి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: గుమ్మలక్ష్మీపురం

గుమ్మలక్ష్మీపురం ఎంపీటీసి స్థానానికి పోటీ చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి పెంకి భారతి సోమవారం సాయంత్రం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని వివిధ వీధుల్లో ఇంటింటికి తిరిగి ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచార గడువు ముగియనుండడంతో అభ్యర్థులు రాత్రి వరకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు.