విజయనగరం జిల్లాలో రోటా వైరస్ వ్యాక్సిన్ల కొరతతో ప్రైవేటులో దోపిడీ
రిపోర్టర్: అశోక్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చిన్నారులకు అందించే రోటా వైరస్ వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది. నిల్వలు లేకపోవడంతో సకాలంలో టీకాలు అందక తల్లిదండ్రులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు మూడు డోసుల వ్యాక్సిన్‌కు రూ.వేలల్లో వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయి.