పెరోల్ పై విడుదలై ఇరవై ఏళ్లుగా తప్పు తిరుగుతున్న హంతకురాలు అరెస్ట్
రిపోర్టర్: శివ
స్థలం: New Delhi
జీవిత ఖైదు అనుభవిస్తూ రెండు దశాబ్దాల క్రితం పెరోల్ పై బయటకు వచ్చి పరారైన సాధనను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హరిద్వార్‌లో అరెస్ట్ చేశారని అధికారులు వెల్లడించారు. 1990 నాటి పదేళ్ల బాలుడి కిడ్నాప్, హత్య కేసులో దోషిగా తేలిన ఆమె, ఆ తర్వాత పేరు మార్చుకుని పూజగా కొత్త జీవితం ప్రారంభించిందని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న కాలంలో ఆమె ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ, హరిద్వార్‌లో వివాహం చేసుకుని తలదాచుకుందని అధికారులు పేర్కొన్నారు.