కేజీబీవీలో మెనూ తప్పితే చర్యలు తప్పవంటూ కలెక్టర్ వార్నింగ్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కన్నెపల్లి
కన్నెపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చేపడుతున్న ప్రహరీ గోడ నిర్మాణం, నూతనంగా పూర్తయిన భోజనశాల భవనాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. వంటశాల నిర్వహణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు నిత్యం మెనూ ప్రకారం పోషకాలతో కూడిన నాణ్యమైన భోజనాన్ని సకాలంలో అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి ఆదేశించారు.