ఆసియా క్రీడల్లో మూడు పతకాలతో మెరిసిన అథ్లెట్ విత్యా రామ్రాజ్

రిపోర్టర్: గోపి స్థలం: Aichi-Nagoya

ఆసియా క్రీడల్లో మూడు పతకాలు సాధించిన భారత అథ్లెట్ విత్యా రామ్రాజ్ తన విజయాల వెనుక తండ్రి పడిన కష్టాన్ని ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. లారీ డ్రైవర్గా పనిచేస్తూ తన తండ్రి భోజనం కూడా మాని, ఒక్క పూట తిని తనకు రన్నింగ్ షూస్ కొనుగోలు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి సాధించిన ఈ విజయాలను ఇప్పుడు తన తండ్రికి అంకితం చేస్తున్నట్లు విత్యా రామ్రాజ్ వెల్లడించారు.