సాలూరులో బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన మంత్రి సంధ్యారాణి

రిపోర్టర్: సునీల్ స్థలం: సాలూరు

సాలూరులో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఏడు బాధిత కుటుంబాలకు గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి రూ.4.50 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. శనివారం మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్న పేదలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆమె తెలిపారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా నిలుస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.