భారీ వర్షాల కారణంగా ఉగ్రరూపం దాల్చిన అల్లూరి జిల్లా జలపాతాలు

రిపోర్టర్: నరేష్ స్థలం: అల్లూరి సీతారామరాజు జిల్లా

రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని, ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని తారాబు జలపాతం ఉగ్రరూపం దాల్చిందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో కొండకోనల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోందని వెల్లడించారు. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జలపాతాల పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు.