వినాయక చవితి పర్వదినాన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన నేత

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వింజమూరు

నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని గ్రామప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు జనసేన నేత శెట్టిపల్లి సురేష్. ఈ పర్వదినాన్ని ప్రజలందరూ ఎంతో ఘనంగా మరియు జాగ్రత్తగా జరుపుకోవాలని ఆయన కోరారు. విఘ్నేశుని ఆశీస్సులు మండల ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు.