మైసిగండి వినాయక మండపంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కడ్తాల్
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని మైసిగండి గ్రామంలో ఏర్పాటు చేసిన పెద్ద వినాయకుని మండపంలో రెండో రోజు గణనాధునికి సభావట్ యాదగిరి చౌహాన్ శారద దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ వేడుకల్లో TPCC సభ్యులు శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ ప్రేమ జహార్ లాల్ నాయక్, ఉప సర్పంచ్ కేతావత్ హిరాసింగ్ నాయక్, కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలు చాటుకున్నారు.