ఓటీటీకి రానున్న తమిళ కామెడీ ఎంటర్‌టైనర్ 'మొద రాతిరి'

రిపోర్టర్: రాజేష్ స్థలం: తమిళనాడు

తమిళ గ్రామీణ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం 'మొద రాతిరి' సెప్టెంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. రాజా కరుప్పసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రిషికాంత్, అనిష్మ అనిల్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా త్వరలోనే డిజిటల్ వేదికపై తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.