సౌదీ అరేబియాకు ఎఫ్ 35 యుద్ధ విమానాల విక్రయానికి ట్రంప్ ఆమోదం
రిపోర్టర్: రాజేష్
స్థలం: అమెరికా
సౌదీ అరేబియాకు 24.3 బిలియన్ డాలర్ల విలువైన ఎఫ్ 35 స్టెల్త్ యుద్ధ విమానాల విక్రయానికి ట్రంప్ యంత్రాంగం ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదిత ఒప్పందంలో 48 ఎఫ్ 35 విమానాలు, 49 ఇంజిన్లు ఉన్నాయి. అయితే ఈ ఒప్పందం ఇంకా తుదిరూపు సంతరించుకోలేదని, కాంగ్రెస్ పరిశీలనను ఎదుర్కోవాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ డీల్ ఆమోదం పొందితే ఇజ్రాయెల్ తర్వాత మధ్యప్రాచ్యంలో ఈ అధునాతన యుద్ధ విమానాలను నడిపే రెండో దేశంగా సౌదీ అరేబియా అవతరించనుంది.