ప్రతి పేదవాడికి ఉపాధి హామీతో అండగా నిలుస్తామన్న దండేపల్లి ఎంపీడీవో

రిపోర్టర్: Alfa News Desk స్థలం: దండేపల్లి

విబిజి రాంజీ పథకంలో ప్రతి నిరుపేదకు ఉపాధి కల్పిస్తామని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల ఎంపీడీవో ప్రసాద్ స్పష్టం చేశారు. ముల్కలపేట గ్రామ శివారులో నిర్వహిస్తున్న పనులను శనివారం ఆయన పరిశీలించి, కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా అందరితో కలిసి ప్రతిజ్ఞ చేయించారు.