మీరట్ లో విషాదం: భార్య వేధింపులతో యువకుడు బలవన్మరణం

రిపోర్టర్: సురేష్ స్థలం: Meerut

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ లో భార్య, అత్తమామల వేధింపులు భరించలేక ప్రబల్ కుమార్ గుప్తా అనే ముప్ పై ఏళ్ల యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని సర్కిల్ ఆఫీసర్ శివ్ ఠాకూర్ వెల్లడించారు. భార్యతో గొడవలు జరగడంతో పోలీస్ స్టేషన్ లో కౌన్సెలింగ్ కూడా నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఘటనపై మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు.