రాయితీ గ్యాస్ సిలిండర్లకు ఆధార్ బయోమెట్రిక్ ఈకేవైసి తప్పనిసరి

రిపోర్టర్: సునీల్ స్థలం: అమరావతి

దేశంలో రాయితీపై వంటగ్యాస్ సిలిండర్లు పొందే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 1 నుండి గ్యాస్ సిలిండర్లకు బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ ఈకేవైసి తప్పనిసరి చేస్తూ కేంద్ర పెట్రోలియం సహజవాయు మంత్రిత్వశాఖ శనివారం ప్రకటన విడుదల చేసింది. నిజమైన లబ్ధిదారులకే రాయితీ అందేలా చూడటంతో పాటు నకిలీ కనెక్షన్లను తొలగించేందుకు ఈ నిబంధన తెచ్చారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 89.9 శాతం మంది ఈ ప్రక్రియ పూర్తి చేశారు.