బంట కాలనీ వార్డు మార్పుపై పంచకర్ల తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: కిరణ్
స్థలం: అనకాపల్లి
విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గంలోని బంట కాలనీని 92వ వార్డు నుండి 88వ వార్డు మార్చడంపై జనసేన నేత పంచకర్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలకు పది కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా వార్డు మార్పు చేయడం సరికాదని ఆయన మండిపడ్డారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారుల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ చర్యను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.