బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన పెందోట పవన్

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన పెందోట పవన్ (మహంత్)ను భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) జిల్లా కార్యదర్శిగా నియమించారు. ఈ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ పెద్దలకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, మండల అధ్యక్షుడు అడుప రాజు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి యువతను సంఘటితం చేస్తూ తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా పవన్ స్పష్టం చేశారు.