పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి బాలయ్య బ్యాంగ్ సాంగ్ విడుదల

రిపోర్టర్: శివ స్థలం: India

వివేక్ దండు హీరోగా పరిచయమవుతున్న 'పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్' చిత్రం నుంచి 'పనసపల్లి బాలయ్య బ్యాంగ్' లిరికల్ సాంగ్ విడుదలైంది. బాలకృష్ణ అభిమాన సంఘం ప్రెసిడెంట్‌గా హీరోయిన్ సంగీర్తన విపిన్ చేసిన మాస్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. 'కోకకోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ' వంటి స్లోగన్స్‌తో సాగిన ఈ పాట థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడిని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. సి.హెచ్. రవికిషోర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.