రేవంత్ రెడ్డి అసమర్థత వల్లే కరెంట్ కోతలు అంటున్న కేటీఆర్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తెలంగాణ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామ రైతులే కరెంటు రాక రోడ్డెక్కుతుంటే డిప్యూటీ సీఎం ఎల్ నినో అంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎల్ నినో వల్ల కాదని, ముఖ్యమంత్రికి తెలివి లేకనే రైతులను అవస్థలు పెడుతున్నారని ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన ధ్వజమెత్తారు.