ఇంట్లోకి దొంగ చొరబడితే ఆడుకోవడానికి బొమ్మ తెచ్చిచ్చిన గోల్డెన్ రిట్రీవర్ కుక్క
రిపోర్టర్: హరి
స్థలం: శాన్ డిగో
అమెరికాలోని శాన్ డిగోలో ఓ ఇంటిలోకి దొంగ చొరబడగా నాష్ అనే గోల్డెన్ రిట్రీవర్ కుక్క అతడిని భయపెట్టే బదులు ఆట ఆడుకోవడానికి బొమ్మను నోట పట్టుకుని తెచ్చిచ్చింది. ఈ విచిత్ర ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా, యజమాని డాంటే రోలే సెక్యూరిటీ యాప్ ద్వారా ఈ దృశ్యాలను చూసి ఆశ్చర్యపోయారు. పోలీసులు ఆ ఇంటికి చేరుకుని దొంగను అరెస్టు చేశారు.